CM Revanth Reddy : కేసీ వేణుగోపాల్‌తో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ

by Muthe.Rajitha |

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

CM Revanth Reddy : కేసీ వేణుగోపాల్‌తో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితం ఎఐసీసీ(AICC) జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌(KC Venugopal)తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కొత్తగా నియమితులైన మంత్రులకు శాఖల కేటాయింపు, టీపీసీసీ కార్యవర్గ ఏర్పాటు, కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీ, రాష్ట్ర కేబినెట్ విస్తరణ తదితర అంశాలపై చర్చించారని సమాచారం. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కూడా పాల్గొన్నారు. వేణుగోపాల్ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికలకు సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు.

కాగా మరికాసేపట్లో రేవంత్ రెడ్డి ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjuna Kharge)తో సమావేశం కానున్నారు. కేబినెట్ లోకి మరో ముగ్గురిని తీసుకోవడం, ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన వంటి అంశాలను ఖర్గేతో చర్చించనున్నారని తెలుస్తోంది.

Next Story