CM Revanth Reddy: రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి.. సత్యనాదెళ్లకు సీఎం విజ్ఞప్తి

by Prasad Jukanti |

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తిచేశారు.

CM Revanth Reddy: రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి.. సత్యనాదెళ్లకు సీఎం విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల (Satyanadella)ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కోరారు. క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కీలక పాత్ర పోషించాలని, ఓపెన్ ఏఐ నుంచి ఉచిత క్రెడిట్స్ ఇవ్వాలని కూడా కోరారు. ఇవాళ మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సత్యనాదేళ్ల నివాసంలో రేవంత్ సమావేశమయ్యారు. అక్కడ వీరిద్దరు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్కిల్ యూనివర్సిటీలో మైక్రోసాఫ్ట్ (Microsoft) భాగస్వామ్యం, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ ప్రతిపాదనలపై చర్చించారు. ఏఐ సిటీలో ఆర్ అండ్ డీ ఏర్పాటుకు సహకారం, క్లౌడ్ కంప్యూటింగ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుపై సత్యనాదెళ్లతో సీఎం చర్చించారు. తెలంగాణలో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయనున్న 6 డేటా డేటా సెంటర్లకు రూ. 32 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ సెంటర్ల పనులు 70 శాతం పనులు పూర్తయ్యాయి. పనులు పూర్తయితే డేటా సెక్యురిటీ, క్లౌడ్ సొల్యూషన్స్ రంగాల్లో అగ్రస్థానానికి హైదరాబాద్ చేరుకోబోతున్నది. అయితే సీఎం హోదాలో రేవంత్ తొలిసారి మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్యనాదేళ్ల భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story