ప్రధాని మోడీకి CM రేవంత్‌ రెడ్డి లేఖ.. ఎందుకో తెలుసా?

by Gantepaka Srikanth |

ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi)కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) లేఖ రాశారు.

ప్రధాని మోడీకి CM రేవంత్‌ రెడ్డి లేఖ.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi)కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) లేఖ రాశారు. అఖిలపక్ష నేతలతో కలిసి మిమ్మల్ని కలవాలనుకుంటున్నామని.. అపాయింట్మెంట్ ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. BC రిజర్వేషన్ల(BC Reservations) పెంపు బిల్లుకు మద్దతు కోరేందుకు మోడీని సీఎం రేవంత్‌ అపాయింట్‌మెంట్ కోరిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు 42శాతానికి పెంచాలని రెండు బిల్లులను తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించించింది.

ఈ బిల్లును సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Ponnam Prabhakar Goud) ప్రవేశ పెట్టారు. సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) నాయకత్వంలో తీసుకున్న ఈ నిర్ణయం బలహీన వర్గాలకు శుభ సూచకం, గొప్ప విప్లవాత్మక నిర్ణయం కూడా అని మంత్రి పొన్నం అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని శాసన సభలో బీఆర్ఎస్, బీజేపీ, సీసీఐ, ఎంఐఎం తదితర అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు.







Next Story