రేపే అసెంబ్లీ సమావేశాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

by Muthe.Rajitha |

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

రేపే అసెంబ్లీ సమావేశాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం సాయంత్రం నీటిపారుదల శాఖపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉన్నత అధికారులు పాల్గొన్నారు. నదీ జలాల పంపకం, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చ జరగినట్టు సమాచారం. నదీ జలాల్లో తెలంగాణ వాటా, ఏపీతో ఉన్న వివాదాలు, బీఆర్‌ఎస్‌ హయాంలో అనుసరించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలపై సీఎం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సమావేశాల్లో ఈ ప్రాజెక్టు అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉండటంతో, ప్రాజెక్టు ప్రతిపాదన నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పనుల పురోగతి, గత రెండేళ్లుగా జరిగిన పనులపై పూర్తి సమాచారం సేకరించారు.

Next Story