CM Revanth Reddy : కేంద్రమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

by Muthe.Rajitha |   (  Updated:2025-03-13 15:25:27  IST  )

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

CM Revanth Reddy : కేంద్రమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. విదేశాంగశాఖ మంత్రి(Minister of Foreign Affairs) జైశంకర్‌(JaiShankar)తో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశమయ్యారు. వచ్చే నెలలో తెలంగాణ(Telangana)లో నిర్వహించే భారత్‌ సమ్మిట్‌(Bharat Summit)పై ఈ భేటీలో కీలకంగా చర్చించినట్టు సమాచారం. ఈ సమ్మిట్ నిర్వహణకు సహకరించాలని జైశంకర్‌ ను సీఎం కోరినట్టు తెలుస్తోంది. ఈ సమ్మిట్ కు సంబంధించిన పొలిటికల్ క్లియరెన్స్ అనుమతిని విదేశాంగశాఖ జారీ చేయాల్సిందిగా కోరారు. ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు జైశంకర్ కు వివరించారు. ఈ సమ్మిట్ కు 60 దేశాలకు చెందిన ప్రతినిధులకు ఆహ్వానాలు పంపుతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కాగా ఈ సమావేశంలో మరో కీలకాంశం చర్చకు వచ్చినట్టు తేలుస్తోంది. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో పలువురు కీలక నిందితులు విదేశాల్లో తలదాచుకుంటుండగా.. వారిని ఎలాగైనా స్వదేశానికి రప్పించి, శిక్ష పడేట్లు చేయాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. ఆయా దేశాల విదేశాంగశాఖలతో మాట్లాడి నిందితులను ఇక్కడికి రప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి జైశంకర్ కు విజ్ఞప్తి చేశారని సమాచారం.

Next Story