- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో బీర్ల ధరల పెంపుపై CM రేవంత్ కీలక ఆదేశాలు
ఎక్సైజ్ శాఖ(Excise Department) అధికారులతో సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిర్వహించిన సమీక్షా సమావేశం ముగిసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఎక్సైజ్ శాఖ(Excise Department) అధికారులతో సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిర్వహించిన సమీక్షా సమావేశం ముగిసింది. బీర్ల ధరల(Beer Prices) అంశంపై సమావేశంలో కీలకంగా చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో బీర్ల ధరలను పరిశీలించాలని ఆదేశించారు. కమిటీ నివేదిక ఆధారంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. కొత్త కంపెనీలకు అనుమతి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మద్యం సరఫరాకు ముందుకొచ్చే కంపెనీల ఎంపికకు పారదర్శక విధానం పాటించాలని చెప్పారు. ఏడాది నుంచి ఎక్సైజ్ శాఖకు బిల్లులు చెల్లిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం బకాయిలను క్రమంగా క్లియర్ చేయాలని సూచించారు.
ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) పాల్గొన్నారు. అంతుకుముందు.. ఈనెలాఖరు కల్లా ఉస్మానియా దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గోషామహల్‌లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని వైద్యఆరోగ్య శాఖకు వీలైనంత త్వరగా బదిలీ చేయాలని సీఎం ఆదేశించారు. రెండు శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన నిర్మాణాలకు సంబంధించిన నమూనా మ్యాప్‌లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.






