ఇందిరమ్మ ఇళ్ల అప్‌డేట్.. కలెక్టర్లకు CM రేవంత్ కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |

ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Indlu), భూభారతి, రుతుపవనాలు, వానాకాలం పంటల సాగు అంశాలపై చర్చించేందుకు మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇందిరమ్మ ఇళ్ల అప్‌డేట్.. కలెక్టర్లకు CM రేవంత్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Indlu), భూభారతి, రుతుపవనాలు, వానాకాలం పంటల సాగు అంశాలపై చర్చించేందుకు మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 64 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని.. 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందని.. ఇప్పటివరకు రూ.12184 కోట్లు ధాన్యం కొనుగోళ్ల సొమ్మురైతులకు చెల్లించామని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోళ్ల వివరాలను వెల్లడించాలని చెప్పారు. మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈసారి 29 శాతం వర్షపాతం అధికంగా ఉందన్నారు. సీజన్ ముందు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. జూన్ 3వ తేదీ నుంచి 20 వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి. ఇందిరమ్మ ఇండ్లు చాలా కీలకం. క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలు బాగా జరిపించాల్సింది కలెక్టర్లే. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Next Story