- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పై సీఎం రేవంత్ సమీక్ష
దోమల నివారణ, చెత్త సేకరణపై సూచనలు
హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యతపై కీలక ఆదేశాలు
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలోనే మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
కోర్ అర్బన్ ఏరియాలో పారిశుద్ధ్యం, దోమల నివారణ, చెత్త సేకరణపై ఈ సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చారు. వాటి నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. దోమల నివారణకు ప్రత్యేక టెక్నాలజీ వాడాలన్నారు. స్ట్రీట్ లైటింగ్ నిర్వహణకు సాంకేతికతను అనుసంధానం చేయాలని తెలిపారు. సమస్య తలెత్తినప్పుడు తక్షణం పరిష్కరించేలా కంట్రోల్ రూంతో అనుసంధానం చేయాలని ఆదేశించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యత పర్యవేక్షణను పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఆహార నాణ్యతను పాటించే విషయంలో హోటళ్లు, రెస్టారెంట్లకు గ్రేడింగ్ ఇచ్చే అంశాన్ని ఆలోచన చేయాలని ఆదేశాలు ఇచ్చారు. నగరంలోని వాణిజ్య సముదాయాలు, వ్యాపార సముదాయాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.






