- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల బ్యాంకు వివరాలు డిజిటల్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు అందించే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.

దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు అందించేందుకు వివిధ విభాగాలలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, జీతాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలను డిజిటలైజ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఇవాళ సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చెల్లింపులు చేసినా సమయానికి ఉద్యోగులకు జీతాలు చెల్లించని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
100 రోజుల్లో నివేదిక సమర్పించాల్సిందే:
డిజిటల్ గవర్నెన్స్‌పై పూర్తిస్థాయి కసరత్తు చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీ రాబోయే 100 రోజుల్లోగా తన సమగ్ర నివేదికను సమర్పించి, ఈ ప్రక్రియను ఒక కొలిక్కి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడువు విధించారు. డిజిటల్ గవర్నెన్స్ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసి, అవసరమైన చట్టాలను రూపొందించాలన్నారు. పరిపాలన వ్యవస్థను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేస్తూ ముందుకు వెళ్లాలని ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ ముఖ్యం అన్నారు.






