- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
బొగ్గు గనుల కేటాయింపులలో సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం సింగరేణి (Singareni)కి అనేక సహాయ సహాకారాలు అందజేస్తోందని.. బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ (Naini Coal Block) సింగరేణికి వచ్చేలా చొరవ తీసుకున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో జరిగే బొగ్గు వేలం పాటలో పాల్గొనేందుకు తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. మరో 35 ఏళ్లకు సరిపడే బొగ్గు నిల్వలు నైనీ కోల్ బ్లాక్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో సిగరేణికి రూ.75 వేల కోట్ల రెవెన్యూ వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో లక్షలాది గుండెచప్పుడు సింగరేణి అని తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులను ఆయన మరో గుడ్ న్యూస్ చెప్పారు. తాడిచెర్ల-2 కోల్ బ్లాక్ (Tadicherla-2 Coal Block) సింగరేణికే ఇస్తున్నామని.. అందుకు ప్రధాని కూడా అంగీకరించారని తెలిపారు. తాడిచెర్ల-2లో 182 మి.టన్నుల బొగ్గు ఉత్పత్తికి అవకాశముందన్నారు. మరో 40 నుంచి 50 ఏళ్లపాటు బొగ్గు ఉత్పత్తి చేయవచ్చని స్పష్టం చేశారు. అదే విషయంపై ఇవాళ నిర్ణయం కూడా తీసున్నామని వెల్లడించారు. ఇది సింగరేణికి ఎంతో ఉపయోగకరంగా మారబోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.






