- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదకరంగా డీలిమిటేషన్ ప్రక్రియ: CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలని పేర్కొన్నారు. కావాలనే ఈ రెండు అంశాలను కలిపి బీజేపీ రాజకీయం చేస్తోందని అన్నారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పెంపు రెండూ కీలక అంశాలని చెప్పారు. రెండూ దేశ ప్రజలు అందరికీ సంబంధించిన కీలక అంశాలని పేర్కొన్నారు. బీజేపీ మాత్రం తమ సొంత వ్యవహారం అన్నట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రతిపక్షాలు తమకు సహకరించడం లేదని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం ప్రచారం చేస్తున్నారు. మహిళలకు ఓటు హక్కు సహా సమాన హక్కులను కల్పించింది కాంగ్రెస్సే అని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కావాలని, కుట్రపూరితంగా దేశ వ్యాప్తంగా కేంద్రం హడావిడి క్రియేట్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఈ బిల్లును అమలు చేయాల్సి ఉంది. 2024లోనే ఎక్కువ మంది చట్టసభల్లో అడుగుపెట్టేవారు. 2011 జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు కలుపుతున్నారు. ఈ అంశంలో రాజకీయ కుట్ర, వివక్ష కలిసి ఉన్నాయని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
దక్షిణాది రాష్ట్రాలపై మోడీ కుట్ర...
‘మహిళా రిజర్వేషన్లు బిల్లుకు తాము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. ఉన్న సీట్ల ఆధారంగానే ఈ బిల్లును అమలు చేయండి. 2011 జనాభా లెక్కల ప్రకారం అమలు చేయాలని ఎన్డీఏ చూస్తోంది. 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలి. దాంతో పాటు కేవలం వచ్చే ఆరు నెలల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి. మరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియ చాలా ప్రమాదకర దిశలో వెళ్తోంది. చిన్న రాష్ట్రాలు, దక్షిణాదికి అన్యాయం చేసే కుట్రను మోడీ చేస్తున్నారు. కుటుంబ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా అమలు చేశాయి. ఉత్తరాదిలో కుటుంబ నియంత్రణ సరిగా జరుగకపోవడంతో జనాభా విపరీతంగా పెరిగింది’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.






