- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: అసలు ప్రాబ్లం అక్కడే వస్తుంది.. యూరియా కొరతపై CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
యూరియా కొరత(Urea Shortage)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: యూరియా కొరత(Urea Shortage)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం కామారెడ్డిలోని వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పరిశీలించారు. కలెక్టరేట్‌లో అధికారులో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రైతులు ఎక్కువ సేపు లైన్లో నిలబడి అలిసిపోయి, అసలు యూరియా లేదని చెప్తున్నారు. యూరియా సరిపడా అందుబాటులో ఉన్నా కూడా అందరూ ఒకే దగ్గర ఉండేసరికి లైన్ పెద్దగా కనిపిస్తుంది. లైన్లో చివర ఉన్న వాడికి యూరియా ఇవ్వాలంటే 8 గంటలు పడుతుంది. ఆ 8 గంటలు లైన్లో నిలబడలేక సహనం లేక ధర్నాలు చేస్తున్నారు. యూరియా కేంద్రం దగ్గర ఉన్న రైతులను ఎవరో ఒకరు తీసుకెళ్లి, రోడ్డు మీద కూర్చోపెడుతున్నారు’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
భారీ వర్షాలు, వరదల వల్ల నష్టం జరిగిన చోట శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వరదల వల్ల పంట పొలాల్లో ఇసుక మేటలను తొలగించేందుకు ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తామని చెప్పారు. రోడ్లు, పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. కొడంగల్‌కు ఎంత మేరకు సాయం చేస్తానో కామారెడ్డి జిల్లాకు కూడా అంత సాయం చేస్తానని మాటిచ్చారు. వరద నష్టంపై గ్రామాల వారిగా అంచనాలు రూపొందించి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. దెబ్బతిన్న రహదారులు, బ్రిడ్జీలు, మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు పంట నష్టానికి సహాయం అందిస్తామన్నారు.






