తెలుగు బడా BIG నిర్మాతలకు షాక్.. టికెట్ల ధరల పెంపుపై CM రేవంత్ సంచలన షరతు

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-28 13:31:37  IST  )

తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu Film Industry)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలుగు బడా BIG నిర్మాతలకు షాక్.. టికెట్ల ధరల పెంపుపై CM రేవంత్ సంచలన షరతు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu Film Industry)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళశారం సాయంత్రం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్ రెడ్డికి సినీ కార్మికులు(Film Workers) సన్మానం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒకప్పుడు తెలుగుచిత్ర పరిశ్రమ అంటే.. మదరాసి అని పిలిచేవారని గుర్తుచేశారు. తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్‌కు తరలించాలని ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి(Marri Chenna Reddy) ఎంతో కృషి చేశారని అన్నారు. ఎన్టీఆర్(NTR), ఏఎన్ఆర్(ANR) సాయంతో హైదరాబాద్‌కు తీసుకొచ్చారని తెలిపారు. ఇవాళ తెలుగు సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తోంది. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు వరిస్తున్నాయని అన్నారు. చిత్రపురి కాలనీకి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడానికి ఆనాటి నాయకులు చేసిన కృషిని ఎవరూ మర్చిపోకూడదని చెప్పారు. చిత్రపరిశ్రమను ప్రోత్సహించాలని ఆనాడు తక్కువ ధరకే భూములు ఇచ్చారని తెలిపారు. అంతేగాకుండా.. కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1964లో నంది అవార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. తనకు సినీ కార్మికుల కష్టాలు తెలుసని.. సినీ కార్మికులను పట్టించుకోనంత స్థాయికి ఇంకా తాను వెళ్లలేదని అన్నారు. సినీ కార్మికుల కోసం నటుడు ప్రభాకర్ రెడ్డి తన సొంత 10 ఎకరాల భూమి ఇచ్చారని వెల్లడించారు. తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి వెళ్లడంలో కార్మికుల కృషి ఉందని కొనియాడారు.

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గద్దర్ అవార్డులు ప్రారంభించామని తెలిపారు. ప్రపంచ సినిమాకు హైదరాబాద్ కేరాఫ్ కావాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు. సినీ కార్మికులు అండగా ఉంటే హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. ఫ్యూచర్ సిటీలో సినీ ఇండస్ట్రీకి స్థలాలు కేటాయిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. సినీ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేకంగా స్కూల్స్ నిర్మిస్తామని చెప్పారు. సినీ కార్మికుల కష్టాలన్నీ తీరుస్తానని చెప్పను.. కానీ నాకు సాధ్యమైనంత వరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక నుంచి రిలీజ్‌కు ముందు సినిమా టికెట్ల ధరలు పెంచితే అందులో 20 శాతం వాటా సినీ కార్మికులకు ఇవ్వాలని నిర్మాతలకు చెప్పారు. అలా చేస్తేనే టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తామని కీలక ప్రకటన చేశారు.

Read More... ఏం చేయబోతున్నామో డిసెంబర్ 9వ చెప్తా: CM రేవంత్

Next Story