- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజాంను మించిన శ్రీమంతుడు కావాలనేదే కేసీఆర్ కోరిక: CM రేవంత్
కాళేశ్వరం కమిషన్ నివేదిక(Kaleshwaram Commission Report)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం కమిషన్ నివేదిక(Kaleshwaram Commission Report)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం అసెంబ్లీలో నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సొమ్ము రూ.లక్ష కోట్లను దోచుకునేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని మండిపడ్డారు. ఆనాడు మహారాష్ట్రతో చర్చ జరిగింది కేవలం ప్రాజెక్టు ఎత్తు గురించే అని గుర్తుచేశారు. కావాలనే హరీష్ రావు పదే పదే తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నారు. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు ఉన్నాయని చెప్పినా మీరెందుకు వినలేదని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టుకు మహారాష్ట్ర అభ్యంతరం చెప్పలేదు. 148 మీటర్ల ఎత్తులో కట్టుకోమని మహారాష్ట్ర కూడా చెప్పింది. అయినా వినకుండా ప్రాజెక్టు లొకేషన్‌ను మార్చారు. కేసీఆర్‌కు ధనాశ, దురాశ కలగడం మూలంగానే లొకేషన్ మార్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లక్ష కోట్లు కొల్లగొట్టాలని ప్రణాళిక వేసుకున్నారు. పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని రాసినట్లే.. ప్రాజెక్టు కడితే హానికరం, నిరుపయోగం అని అధికారులు పదే పదే చెప్పారు. అయినా కూడా వినకుండా దోచుకోవడమే లక్ష్యంగా చేసుకొని కట్టారని అన్నారు. నిజాం ప్రభువు కంటే శ్రీమంతుడు కావాలనేదే కేసీఆర్(KCR) కోరిక అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్లలో నీళ్లు ఉన్నాయని ఉమా భారతి చెప్పారని స్పష్టం చేశారు.






