- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్‌లోకి లొంగిపోయిన మావోయిస్టులు.. CM రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..
మావోయిస్టుల లొంగుబాటు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టుల లొంగుబాటు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లొంగిపోయిన మావోయిస్టులపై ఉన్న కేసులను కూడా ఎత్తివేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు. చట్టపరంగా ఎత్తివేయగలిగే కేసులను ఎత్తివేస్తాం.. తీవ్రమైన కేసులు ఉంటే పరిశీలిస్తామని తెలిపారు. వ్యక్తులు, వారిపై ఉన్న నేరాల తీవ్రతను బట్టి ఆలోచిస్తామని అన్నారు. అంతేకాదు.. లొంగిపోయిన మావోయిస్టులు రాజకీయాల్లోకి వస్తామన్నా స్వాగతిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే కొందరు రాజకీయాల్లోకి వచ్చి రాణించారు. ప్రజా ప్రతినిధులు కూడా అయ్యారు. సీతక్క లాంటి వారు ప్రస్తుతం మంత్రులుగా పనిచేస్తున్నారని గుర్తుచేశారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఎవరికైనా కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలనే ఆసక్తి ఉంటే.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను కలిసి అభిప్రాయం చెప్పువచ్చని సూచించారు. నిరభ్యంతరంగా కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తామని భరోసా ఇచ్చారు.
హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శనివారం 130 మంది మావోయిస్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయిపోయింది. మావోయిస్టులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మొత్తం 124 ఆయుధాలను సరెండర్ చేశారు. లొంగిపోయిన వారిలో దేవ్‌జీ, బడే చొక్కారావు గన్‌మెన్లు కూడా ఉన్నారు.






