మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడితే ట్రోల్స్ చేశారు: CM రేవంత్

by Gantepaka Srikanth |

ఏ సమస్యకైనా చర్చలతోనే పరిష్కారం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడితే ట్రోల్స్ చేశారు: CM రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: మెస్సీ(Messi)తో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడితే తనను ట్రోల్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. శనివారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. మెస్సీతో ఏ భాషలో మాట్లాడారు.. అసలేం మాట్లాడారు అంటూ కూడా తనను విమర్శించారని అన్నారు. అసలు భాషతో పనేముంది.. తెలివి ఉండాలి కానీ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ సమస్యకైనా చర్చలతోనే పరిష్కారం అని అన్నారు. పక్క రాష్ట్రంతో తాము అందుకే చర్చలు జరుపుతున్నామని.. చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిన చరిత్ర తమదని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపితేనే చర్చలకు వస్తామని కండిషన్ పెట్టామని గుర్తుచేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగాయో లేదో.. నిజనిర్ధారణ కమిటీ ద్వారా విచారణ చేయించుకోవచ్చు అని హితవు పలికారు. అంతేకాదు.. జూరాల ప్రాజెక్టు కట్టి నీటిని తరలిస్తామని కూడా హెచ్చరించానని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదని.. గత పదేళ్లలోనూ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఎంతో అనుభవం ఉన్న మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చి సలహాలు, సూచనలు ఇస్తారనుకున్నా. రెండేళ్లుగా ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోవటం విచారకరం. గతంలో బీఆర్ఎస్ నేతలు అవమానించినా.. కాంగ్రెస్‌ నేతలు సభకు వచ్చి మాట్లాడేవారని గుర్తుచేశారు.

Next Story