- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్, బీజేపీ నేతలు తప్పుబడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్ నిర్ణయంపై తాము స్పందించం.. ఎవరికైనా స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే కోర్టులు ఉన్నాయి.. సుబ్బరంగా అక్కడికి వెళ్లి తేల్చుకోవచ్చు అని అన్నారు. బీఆర్ఎస్‌కు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని స్వయంగా హరీష్ రావే చెప్పారని గుర్తుచేశారు. అందుకు తగ్గట్టుగా సభలో సమయం ఇవ్వాలని కోరారు.. సభలో సభ్యుల సంఖ్యపై స్పీకర్ బులిటెన్ విడుదల చేస్తారు.. అప్పుడు అభ్యంతరం చెప్పని బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఆ పార్టీ అధినేత కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరు.. గజ్వేల్ ప్రజలు కూడా ఆయన మీద పెట్టుకున్న ఆశ వదులుకున్నారు.. అధినేతలు ఉన్న పార్టీలో క్రమశిక్షణగా ఉంటాయి.. నాయకుడు లేని పార్టీలు అలాగే ఉంటాయని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యబద్దంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రతిపక్షాల మీద కక్షసాధింపు చర్యలు మా ప్రభుత్వం చేయలేదని చెప్పారు. ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు స్వేచ్చగా పోటీ చేసి ఓట్లు అడిగారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.






