‘మా కంటే ముందే రహస్యంగా వెళ్లాల్సిన అవసరం ఏంటి?’.. కిషన్ రెడ్డిపై CM రేవంత్ ఫైర్

by Gantepaka Srikanth |

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

‘మా కంటే ముందే రహస్యంగా వెళ్లాల్సిన అవసరం ఏంటి?’.. కిషన్ రెడ్డిపై CM రేవంత్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి మాట్లాడే ప్రతీ మాట కేసీఆర్(KCR) రాసిచ్చేదే అని హాట్ కామెంట్స్ చేశారు. మేము ఢిల్లీ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించిన ప్రతీసారి.. మాకంటే ముందే కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఎందుకు కలుస్తున్నారో కూడా చెప్పడం లేదని మండిపడ్డారు. కిషన్ రెడ్డి ప్రవర్తన చాలా అనుమానాలు రేకెత్తిస్తోందని సీరియస్ అయ్యారు. కేంద్రమంత్రులను కలవడానికి మాతో ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. మాకంటే ముందే వెళ్లి రహస్యంగా వెళ్లి చర్చించాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగారు. కిషన్ రెడ్డి, కేసీఆర్ కంటే.. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ చచ్చిన పాము.. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని అన్నారు. పోలవరం-బనకచర్లపై కేంద్రానికి మన అభ్యంతరాలను తెలిపామని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు గోదావరి వాటర్‌ ట్రైబ్యునల్‌ తీర్పునకు వ్యతిరేకమని వాదించామన్నారు. ఏపీ ప్రభుత్వం చేసిన బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనను కేంద్రం వెనక్కి పంపిన నేపథ్యంలో మంత్రి ఉత్తమ్‌ ప్రజాభవన్‌లో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని కిషన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Next Story