‘కమ్యూనిజం అంటే లైబ్రరీలో దొరికే పుస్తకం కాదు’.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-30 11:21:42  IST  )

కమ్యూనిజం(Communism) అంటే లైబ్రరీలో చదువుకునే పుస్తకం కాదు.. సమాజాన్ని సమూలంగా మార్చే ఆలోచన అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు.

‘కమ్యూనిజం అంటే లైబ్రరీలో దొరికే పుస్తకం కాదు’.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కమ్యూనిజం(Communism) అంటే లైబ్రరీలో చదువుకునే పుస్తకం కాదు.. ప్రజల పక్షాన పోరాడే చైతన్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతం ఇంకా పెరగాలి, ఆలోచనా పరిధి కూడా మారాలని అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతీలో ఏర్పాటు చేసిన సురవరం సుధాకర్ రెడ్డి(Suravaram Sudhakar Reddy) సంస్మరణ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఏ ప్రభుత్వం దిగిపోయినా దానికి కమ్యూనిస్టులే కారణం అని అన్నారు. కమ్యూనిస్టులు అంటేనే ప్రతిపక్షం అని చెప్పుకొచ్చారు. వారి కంటే గొప్పగా ఆ పాత్రను ఇంకెవరూ పోషించలేరని అన్నారు. కొందరు రాజ్యాంగాన్ని, ఎన్నికల సంఘాన్ని మార్చాలని కుట్ర చేస్తున్నారు. బిహార్‌లో ఐదు లక్షల ఓట్లు మాయమయ్యాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో విపక్షాలు అన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉంది అని కోరారు.

నమ్మిన సిద్ధాంతం కోసం మా పాలమూరు బిడ్డ సురవరం సుధాకర్ రెడ్డి కడదాకా పోరాటం చేశారని కొనియాడారు. విద్యార్థి ఉద్యమాల నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎదిగారని అన్నారు. దాదాపు 65 సంవత్సరాలు ఎర్రజెండా నీడనే ఉన్నారని చెప్పారు. సామాజిక చైతన్యం ఉన్న నాయకుడు అని అన్నారు. పేదల జీవితాల్లో మార్పు రావాలని నిరంతరం శ్రమించారని గుర్తుచేశారు. సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోయేలా తాము కూడా ప్రయత్నం చేస్తామని.. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని కీలక ప్రకటన చేశారు.

Next Story