- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిసెంబర్ ఒక మిరాకిల్ మంత్: సీఎం రేవంత్ రెడ్డి
డిసెంబర్ ఒక మిరాకిల్ మంత్: సీఎం రేవంత్ రెడ్డి

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుక(Christmas Celebrations)ల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి జరుపుకునే పండుగా క్రిస్మస్ అని అన్నారు. ద్వేషించే వారిని కూడా ప్రేమించే గుణాన్ని స్ఫూర్తిగా ఏసు ప్రభువు నింపారని కొనియాడారు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించారని అన్నారు. ఏసు ప్రభువు స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ ఒక మిరాకిల్ మంత్ అని చెప్పారు. సోనియా గాంధీ కూడా డిసెంబర్‌లోనే జన్మించారని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఇంత ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నామంటే.. దానికి కారణం సోనియా గాంధీనే అని తెలిపారు. రాజకీయంగా భారీ మూల్యం చెల్లించి, ఏపీలో పార్టీకి నష్టం జరిగినప్పటికీ సోనియా గాంధీ తెలంగాణను ప్రసాదించారని గుర్తుచేశారు. ఇదే డిసెంబర్‌లో తెలంగాణ ప్రజా ప్రభుత్వం కూడా ఏర్పడిందని అన్నారు. పేదల ఆకలి తీర్చాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రత చట్టం తెచ్చిందని అన్నారు. ఇప్పుడు పేదవాడి ఆకలి తీరాలని నెలకు ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందిస్తున్నామని అన్నారు. ఉచిత విద్యుత్ ద్వారా పేదల ఇళ్లలో వెలుగులు నింపాం, అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే వ్యవసాయంపై రూ.1.04 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. క్రిస్టియన్ మిషనరీలు ప్రభుత్వంతో పోటీపడి విద్య, వైద్యం అందించాయని తెలిపారు.






