Delhi: కేబినెట్‌ విస్తరణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. శుక్రవారం ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

Delhi: కేబినెట్‌ విస్తరణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. శుక్రవారం ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. కేబినెట్ విస్తరణ జరగాలంటే పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం, ముఖ్యనేతలతో చర్చలు జరగాలన్నారు. ఆ తరువాతే విస్తరణపై నిర్ణయం తీసుకుంటారన్నారు. ప్రస్తుత తన పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి చర్చ జరుగలేదని అన్నారు. అనంతరం అల్లు అర్జున్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ వచ్చి సైలెంట్‌గా సినిమా చూసి వెళ్తే ఎలాంటి గొడవ ఉండేది కాదని అన్నారు. హడావిడి చేయడం వల్ల ఒక మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు.

అందుకే అల్లు అర్జున్‌ను ఈ కేసులో ఏ11గా పోలీసులు చేర్చారని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. అల్లు అర్జున్‌కు సినిమా చూడాలనిపిస్తే స్టూడియోలోనే స్పెషల్​షో వేసుకొని చూడొచ్చు అని అన్నారు. ప్రేక్షకుల మధ్య, పబ్లిక్‌లో సినిమా చూడాలని అనుకున్నప్పుడు ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అల్లు అర్జున్​కావాలని ఎందుకు అరెస్ట్​చేస్తామని అన్నారు. ‘అల్లు అర్జున్ నాకు చిన్నప్పటినుంచి తెలుసు. వాళ్ల మామ చిరంజీవితో పాటు ఆయనకు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ లీడర్ అని గుర్తుచేశారు. అంతేకాదు.. అల్లు అర్జున్ భార్య తమకు బంధువు అని అలాంటప్పుడు కక్షసాధింపు చర్యలు ఏముంటాయని ప్రశ్నించారు. హోంశాఖ తన వద్ద ఉందని, తనకు అన్నీ తెలుసని అన్నారు.

Next Story