దేశం కోసం రాహుల్ ప్రధాని కావాలి.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

వికారాబాద్‌ జిల్లా అనంతగిరి హిల్స్‌లో కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది.

దేశం కోసం రాహుల్ ప్రధాని కావాలి.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్‌ జిల్లా అనంతగిరి హిల్స్‌లో కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి , కేసీ వేణుగోపాల్‌, కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే కాంగ్రెస్ కార్యకర్త లక్ష్యమని అన్నారు. దేశం కోసమైనా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ప్రజా జీవితంలో తానెప్పుడూ పైరవీలు చేయలేదని అన్నారు. గతంలో ప్రజా సమస్యలపై గళం విప్పిన నాపై కేసులు పెట్టారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రణాళికబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ అంశాలపై నేతలతో రాహుల్‌ చర్చించారు. మరోవైపు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శలు చేశారు. ఏఐసీసీకి ఏటీఎంగా మారిన తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం అంటూ సెటైరికల్ ట్వీట్ పెట్టారు. ‘మొన్న రేవంత్ రెడ్డి మీకు ఇస్తానన్న వేయ్యి కోట్ల రూపాయలు కలెక్ట్ చేసుకోవడానికి తెలంగాణకు వచ్చారా? అని ప్రశ్నించారు. ఇది గమనించిన కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్‌పై మండిపడుతున్నారు.

Next Story