- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి రావొద్దు.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్‌లోని బుద్ధ భవన్‌లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హైడ్రా పోలీస్ స్టేషన్(Hydra Police Station)ను ప్రారంభించారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని బుద్ధ భవన్‌లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హైడ్రా పోలీస్ స్టేషన్(Hydra Police Station)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలో కాలష్య పెరిగిపోయి అక్కడ ప్రజలు జీవించలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఢిల్లీలో పాటు దేశంలోని అనేక మెట్రో పాలిటన్ నగరాల్లో జీవించలేని పరిస్థితులు ఉన్నాయని.. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైడ్రా అంటే ఇళ్లు కూల్చేది అన్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. హైడ్రా అంటే ప్రజల ఆస్తులు రక్షించేది.. ఇది ప్రజలు గుర్తించాలని అన్నారు. చిన్న వర్షం పడితే హైదరాబాద్ నగరం మొత్తం అల్లకల్లోలం అవుతుంది.. ఇంటి నుంచి కాలు బయటపెట్టే పరిస్థితి ఉండదు.. కాలనీలన్నీ చెరువులను తలపిస్తాయని గుర్తుచేశారు. భవిష్యత్‌లో అలాంటి పరిస్థితి ఏర్పడొద్దనే ఉద్దేశంతో హైడ్రాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కాగా, రాష్ట్రంలో భూ కబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టేందుకు ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీని పరిధిని మరింత విస్తరించేలా ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్టేషన్‌లో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 12 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 30 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తారు.






