- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Revanth Reddy : మావోయిస్టులకు CM రేవంత్ కీలక పిలుపు
హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం(Police Martyrs' Memorial Day) ఘనంగా నిర్వహించారు.

దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం(Police Martyrs' Memorial Day) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొని పోలీసు అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను ఫణంగా పెట్టాల్సి వచ్చినా పోలీసులు వెనకడుగు వేయట్లేదని కొనియాడారు. తాము కూడా పోలీసులకు పూర్తి స్వేచ్చను ఇచ్చామని చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగాలకు సైతం సిద్ధపడుతున్న అమరుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విద్య, ఆర్థిక పరమైన విషయాల్లో ఎప్పుడు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
‘‘పలు విభాగాల్లో తెలంగాణ పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారు. ఇటీవలే డ్రగ్స్ మహమ్మారిపై పోరాడేందుకు ప్రత్యేకంగా ఈగల్ టీమ్ పేరుతో బృందం ఏర్పాటు చేశాం. రోజూ సైబర్, డిజిటల్, మార్ఫింగ్, డ్రగ్స్ పేరుతో కొత్త తరమా నేరాలు పుట్టుకొస్తున్నాయి. టెక్నాలజీ రూపంలో వచ్చే నేరాలను టెక్నాలజీతోనే మన పోలీసులు సమాధానం చెబుతున్నారు. సైబర్ నేరాలకు కూడా ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశాం. సైబర్ నేరాల నియంత్రణలో దేశంలో తెలంగాణ టాప్ పొజీషన్లో ఉంది’’ అని సీఎం చెప్పుకొచ్చారు.
ఇటీవల అనేకమంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని మిగతా మావోయిస్టులను కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ అభివృద్ధిలో భాగం కావాలని ఈ సదర్భంగా మావోయిస్టులను విజ్ఞప్తి చేశారు.
పోలీసుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రాజకీయ ఒత్తిడి లేకుండా పనిచేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. తాము అధికారంలోకి వచ్చాక 16 వేల కానిస్టేబుల్, ఎస్ఐ పోలీసులు భర్తీ చేశాం. పోలీసులకు ఏదైనా జరుగరానిది జరిగిదే దేశంలోనే అత్యధిక పరిహారం ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పోలీసు ఉద్యోగం అంటే కత్తి మీద సాము లాంటిది. ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు వారి జీవితాలను గ్యాగం చేస్తున్నారని ఈ సందర్భంగా అభినందించారు.






