- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్లపై CM రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భారీ శుభవార్త చెప్పారు. శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోల్‌లో పర్యటించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భారీ శుభవార్త చెప్పారు. శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. మరికొన్ని నెలల్లోనే నోటిఫికేషన్లు(Job Notifications) ఇవ్వబోతున్నామని.. తాము అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అయిన సందర్భంగా.. మరో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని కీలక ప్రకటన చేశారు. మాదిగల బిడ్డలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే కాస్త ఆలస్యం చేశామని.. ఎస్సీ వర్గీకరణ తర్వాతే ఉద్యోగాలు ఇస్తాం అని మాటిచ్చినం.. ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలు చేశాం.. త్వరలోనే నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని తెలిపారు.
బీఆర్ఎస్(BRS) హయాంలో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్నారని అన్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరినీ మోసం చేశారని మండిపడ్డారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రూ.500లకు గ్యాస్ సిలిండర్ ఇచ్చాం, రైతులకు రైతు భరోసా ఇచ్చాం, నిరుద్యోగులకు 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేశామని అన్నారు. అంతేగాకుండా.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.






