- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: ఆటో డ్రైవర్లకు CM రేవంత్ కీలక సూచన
పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ డీజిల్ బస్సులు ఉండకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తక్షణమే వాటిని జిల్లాలకు తరలించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ మహా నగరంలో తిరిగే ఆటోలు(Autos) కూడా సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వర్షన్‌లోకి మారాలని ఆదేశించారు. ఎలక్ట్రిక్ వాహనాలను పన్ను మినహాయింపు ఉంటుందని కీలక ప్రకటన చేశారు. వీలైనంత త్వరగా పెట్రోల్, డీజిల్ వాహనాలకు చెక్ పెట్టి.. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని సూచించారు. ఆటంకాలను అధిగమించి కంచ గచ్చిబౌలిని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అక్కడి భూముల్లో అభివృద్ధి ఆటంకాలు తాత్కాలికమేనని, కంచ గచ్చిబౌలిలో కొత్త కంపెనీల ఏర్పాటుతో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ‘హైదరాబాద్ ప్రజల దాహర్తిని తీర్చేందుకు పి.జనార్ధన్‌రెడ్డి (పీజేఆర్) చేసిన కృషి మరువలేనిది. ఆయన పోరాటాల వల్లే హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాలు వచ్చాయి. ఎప్పుడు పిలిచినా పలికే పేదల నాయకుడిగా ఎంతో గొప్ప పేరు సంపాదించారు. హైదరాబాద్ దోమలగూడలోని పీజేఆర్ ఇల్లు ఒక జనతా గ్యారేజీగా కనిపించేది’ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.






