- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Japan Tour : ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన(CM Revanth Reddy Japan Tour) నేటితో(మంగళవారం) ముగిసింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన(CM Revanth Reddy Japan Tour) నేటితో(మంగళవారం) ముగిసింది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకు రావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 22 వరకు 8 రోజులపాటు జపాన్ లో పర్యటించారు. జపాన్ లోని ఓసాకాలో జరిగిన ఇండస్ట్రియల్ ఎక్స్ పో(Osaka Industrial Expo) పాల్గొన్న అనంతరం.. వివిధ పారిశ్రామిక వర్గాలతో పలు సమావేశాలు జరిపారు. 8 రోజుల జపాన్ పర్యటనలో సీఎం బృందం తెలంగాణకు రూ. 12,062 కోట్ల పెట్టుబడులను సాధించారు.
ఈ భారీ పెట్టుబడులతో రాష్ట్రంలో దాదాపు 3500 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయని అధికారులు పేర్కొన్నారు. కాగా పర్యటనలో చివరి రోజున జపాన్‌లోని ప్రసిద్ధ హిరోషిమా శాంతి స్మారకాన్ని (Hiroshima Peace Memorial), మహాత్మా గాంధీ విగ్రహాన్ని (Mahatma Gandhi Statue in Hiroshima) సందర్శించి నివాళులు అర్పించారు. ఇక రేపు సీఎం రేవంత్ రెడ్డి బృందం తిరిగి హైదరాబాద్ కు రానున్నారు.






