- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనిరుధ్ రెడ్డి.. ఇది నా మాటగా వాళ్లకు చెప్పు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్
ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు.

దిశ, జడ్చర్ల : ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి కీలక విజ్ఞప్తి చేశారు. ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే అండగా నిలబడిందని నొక్కి చెప్పారు. సీఎం తన ఎక్స్ ఖాతాలో ఏం పోస్ట్ చేశారంటే.. ‘‘పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉద్ధండాపూర్ రిజర్వాయర్ పరిధిలో నిర్వాసితులుగా మారి.. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి కన్నీళ్ల సాక్ష్యంగా మిగిలిన బాధితులకు అండగా నిలిచాం. అధికారంలోకి వస్తే.. పరిహారం ఇచ్చి కన్నీళ్లు తుడుస్తామన్న హామీని నిలబెట్టుకున్నాం. ఏడాదిన్నరలో రూ.250 కోట్ల పరిహారం మంజూరు చేశాం. ఇందులో రూ.25 కోట్లు గత నెలలో విడుదల చేశామని, ఈ నెలలో మరో రూ.175 కోట్లు విడుదల చేశామని రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో నిర్వాసితులతో సహపంక్తి భోజనం చేసి డిసెంబర్ 9 లోపు పూర్తి పరిహారం అందిస్తామని నా మాటగా చెప్పాల్సిందిగా జడ్చర్ల శాసన సభ్యుడు అనిరుధ్ రెడ్డికి సూచించాను.
అంతేకాకుండా 6 వేల మందితో సహపంక్తి భోజనం చేసి నా హామీ మేరకు వారికి భరోసా ఇచ్చిన అనిరుధ్‌కు నా అభినందనలు’’ అని సీఎం రేవంత్ రెడ్డి తన అధికారిక ఎక్స్ ఖాతాలో రాస్తూ సహపంక్తి భోజనాల ఫొటోలను పోస్ట్ చేశారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఉదండాపూర్ నిర్వాసితుల పరిహారం చెల్లింపు పై పోస్ట్ చేయడం సహపంక్తి భోజనం ఫొటోలను పోస్ట్ చేస్తూ స్థానిక ఎమ్మెల్యేను అభినందించటంతో ఉదండపూర్ భూ నిర్వాసితులతో పాటు జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






