CM Revanth: ‘నిద్రలో కనేది కల.. నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొలిపేది కళ’

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-15 04:04:00  IST  )

ప్రతిష్టాత్మక ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2024’(Telangana Gaddar Film Awards) వేడుక గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

CM Revanth: ‘నిద్రలో కనేది కల..  నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొలిపేది కళ’
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2024’(Telangana Gaddar Film Awards) వేడుక గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘నిద్రలో కనేది కల.. నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొలిపేది కళ. ఆ కళకు ప్రాణంపోసే సినీ పరిశ్రమను గుర్తించి, గౌరవించే సాంప్రదాయాన్ని ప్రజా ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. తెలంగాణ చైతన్యానికి ప్రతీక.. తన గళంతో జనంలో స్ఫూర్తిని నింపిన పతాక.. గద్దరన్న స్మృతిలో రాష్ట్ర ప్రభుత్వం తరపున “తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్”ను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది.

తెలంగాణ రైజింగ్ - 2047 ప్రణాళికలో సినీ పరిశ్రమకు ఒక చాప్టర్ ఉండాలన్నది నా ఆకాంక్ష. మన రాష్ట్రం 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలి. అందులో సినీ పరిశ్రమ వాటా ఉండాలి. ఆ స్థాయికి పరిశ్రమ ఎదగడానికి ప్రజా ప్రభుత్వం నుండి అవసరమైన సంపూర్ణ సహకారం అందిస్తాం. హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో గడచిన 10 ఏండ్ల సినిమాలకు అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు’’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story