TG: రేషన్ కార్డులపై CM రేవంత్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Gantepaka Srikanth |

కొత్త రేషన్ కార్డు(Ration Cards)ల జారీ వేళ సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆసక్తికర ట్వీట్ పెట్టారు.

TG: రేషన్ కార్డులపై CM రేవంత్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త రేషన్ కార్డు(Ration Cards)ల జారీ వేళ సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ‘‘సన్నబియ్యంతో పల్లెల్లోని రేషన్ షాపుల వద్ద సందడి సంతరించుకుంది. కొత్త రేషన్ కార్డుల కోసం పేదవాడి పదేళ్ల ఎదురు చూపులు నేడు ఫలించబోతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 5.61 లక్షల కొత్త రేషన్ కార్డులు, 3.10 కోట్ల మందికి ఆహార భద్రత, ఒక్కొక్కరికి ఆరు కేజీల ఉచిత సన్నబియ్యం. ఇదీ పేదల సంక్షేమం పట్ల మా వజ్ర సంకల్పం’ అని రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

కాగా, పేదలకు రేషన్‌ పథకంలో రాష్ట్రం సరికొత్త మైలురాయికి చేరుకుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. జులై 14 నాటికి రాష్ట్రంలో మొత్తం రేషన్‌ కార్డుల సంఖ్య 95,56,625కి.. లబ్ధిదారుల సంఖ్య 3,09,30,911కి పెరగబోతోందని తెలిపారు. ఆహారభద్రతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నేడు(సోమవారం) ప్రారంభించబోతున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే సభలో కొత్త కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు. ఈ మేరకు ఉత్తమ్‌ ప్రకటన విడుదల చేశారు.

Next Story