- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సీరియల్ వస్తుందంటే అందరం టీవీ ముందు ఉండేది.. CM రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన శ్రీమద్ భాగవతం(Srimad-Bhagavatam) పార్ట్-1 చిత్ర ప్రారంభోత్సంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన శ్రీమద్ భాగవతం(Srimad-Bhagavatam) పార్ట్-1 చిత్ర ప్రారంభోత్సంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. క్లాప్ కొట్టి సినిమా షూటింగ్‌ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్ సిటీలో శ్రీమద్ భాగవతం చిత్రీకరణ జరగడం రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ.. దేశంలోనే యూనిక్ స్టూడియో అని చెప్పారు. రామాయణం, మహా భారతం, భాగవతం మన జీవితాల్లో భాగం అయిపోయాయని అన్నారు. ఇలాంటి గొప్ప కథను మరోసారి ప్రజలను అందించాలనే నిర్ణయం తీసుకున్న నిర్మాతలను అభినందించారు. తరం మారుతున్న సందర్భంగా దృశ్యకావ్యం తీయడం గొప్ప విషయం అని ప్రశంసించారు. 40 ఏళ్ల క్రితం టీవీల్లో రామాయణం సీరియల్ వస్తుందంటే.. బయట రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండేవని గుర్తుచేశారు. ఒక్కరు లేకుండా అందరూ టీవీల ముందు ఉండేదని అన్నారు. అంతేకాదు.. రామోజీ ఫిల్మ్ సిటీ అనే ఒక గొప్ప స్టూడియో తెలంగాణలో ఉందని చెప్పేందుకు గర్వపడుతున్నానని కొనియాడారు. కాగా, శ్రీమద్ భాగవతం చిత్రాన్ని ఆకాష్ సాగర్, సాగర్పిక్చర్ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.






