- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇల్లు గొప్పగా ఉండాలంటే పెత్తనం వారే చేయాలి: CM రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కిచెన్ షెడ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజాపరిపాలనలో ఆడబిడ్డల పాత్ర ప్రత్యేకం అని అన్నారు. ఆడబిడ్డల పెత్తనం ఉన్న ఇల్లు గొప్పగా ఉంటుందని తెలిపారు. ఆడబిడ్డల అభ్యున్నతికి ఎన్నో పథకాలు తీసుకొచ్చాం.. వెయ్యి బస్సులను మహిళా సంఘాలకు అందించాం.. సోలార్ ప్లాంట్లకు మహిళలను యజమానులను చేస్తున్నాం.. 10 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తున్నాం.. అక్షయపాత్ర సహాయంతో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రూ.5 వేల కోట్లతో కొడంగల్‌లో ఎడ్యుకేషన్ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నామని.. త్వరలోనే అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్‌గా కొడంగల్‌ను తీర్చిదిద్దుతానని ప్రకటించారు. చదువు కోసం రాష్ట్రం నలుమూలల నుంచి కొడంగల్‌కు వచ్చేలా చేస్తాని అన్నారు.






