- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ అసెంబ్లీకి వస్తే.. ఆ విషయం అడగాలని అనుకున్నా: CM రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఎంతో అనుభవం ఉన్న మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చి సలహాలు, సూచనలు ఇస్తారని ఎక్స్‌పెక్ట్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో కృష్ణా నదీ జలాల అంశాలపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు పదేళ్ల బీఆర్ఎస్(BRS) పాలనలోనూ పాలమూరుకు ఎంతో అన్యాయం జరిగిందని అన్నారు. కరువు, పేదరికాన్ని స్వయంగానే నేనే కళ్లార చూశాను అని చెప్పారు. కృష్ణా నదీ ప్రాజెక్టులపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఎంతో అనుభవం ఉన్న మాజీ సీఎం కేసీఆర్(KCR) సభకు వచ్చి సలహాలు, సూచనలు ఇస్తారని ఎక్స్‌పెక్ట్ చేశాం. ఆయన ఇలా వచ్చి.. అలా వెళ్లారు.. బహిరంగ సభల్లో మాట్లాడిన దానికంటే.. చట్ట సభల్లో మాట్లాడిన మాటలకే ఎక్కువ విలువ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఆయన ప్రజల కంటే పార్టీకి, పార్టీ మీటింగ్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. దీంతో చట్టసభల పట్ల బీఆర్ఎస్‌కు ఉన్న చిన్నచూపు మరోసారి బయటపడిందని అన్నారు. కేసీఆర్ సభకు రాకపోవడానికి కారణాలేమీ లేవని తెలిపారు. ఈసారి సభలో ఎవరూ అనుచిత వ్యాఖ్యలు కూడా చేయలేదని అన్నారు. దీనిపై అవసరమైతే నిజనిర్ధారణ కమిటీ వేయండి అని కీలక వ్యాఖ్యలు చేశారు.
జానారెడ్డి, భట్టి విక్రమార్క ఇద్దరూ సమర్థులే
గతంలో బీఆర్ఎస్ నేతలు అవమానించినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభకు వచ్చి మాట్లాడేవారు. ప్రతిపక్ష నేతలు అసెంబ్లీలో మాట్లాడకుంటే అంతిమంగా ప్రజలకే అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాలపై చర్చను తెరపైకి తెచ్చిందే కేసీఆర్ అని గుర్తుచేశారు. అందుకే కేసీఆర్ సభకు రావాలని తాము పదే పదే విజ్ఞప్తి చేశామని అన్నారు. గతంలో జానారెడ్డి, భట్టి విక్రమార్క ఇద్దరూ సమర్థవంతంగా ప్రతిపక్ష పాత్ర పోషించారని అన్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా ప్రజా సమస్యలు లేవనెత్తారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడేమో.. సభలు పెట్టండి.. తోలు తీస్తాం.. బట్టలు విప్పుతాం.. అని సవాల్ చేశారు. తీరా సమావేశాలు పెడితేనేమో ప్రతిపక్ష నాయకుడు రాదు.. వచ్చిన ఎమ్మెల్యేలు బాయ్ కాట్ అంటూ పారిపోతున్నారని విమర్శలు చేశారు. ఎవరి తోలు ఎవరు తీస్తారో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.
కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అడుగుదాం అనుకున్నా..
కేసీఆర్ కృష్ణా ప్రాజెక్టులపై రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. ఆయన ఎందుకు అలా చేశారో అసెంబ్లీకి వస్తే అడుగుదాం అనుకున్నా. ఉద్దేశపూర్వకంగా చేశారా?.. ఎవరైనా తప్పుదోవ పట్టించారా అనే విషయాన్ని అడగాలని అనుకున్నా. 24 ప్రాజెక్టులకు 490 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో చేసిన కేటాయింపులే అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.






