- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ స్థాయి ఉంటేనే శత్రువుగా భావిస్తా.. CM రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ కవి అందెశ్రీ(Ande Sri) రచించిన హసిత భాష్పాలు పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆవిష్కరించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కవి అందెశ్రీ(Ande Sri) రచించిన హసిత భాష్పాలు పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం కవులకు, పోరాటానికి స్ఫూర్తినిచ్చిన గడ్డ అని కొనియాడారు. ఉద్యమంలో ప్రజలకు ఎంతో మంది కవులు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. గూడ అంజన్న, దశరథి, కాళోజీ, అందెశ్రీ, గద్దర్, గోరెటి వెంకన్న ఇలా అనేక మంది ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. కొందరు నకిలీ ఉద్యమకారులు తామే ఉద్యమకారులమని చెప్పుకుంటూ తిరుగుతున్నారని విమర్శించారు. వారు అలా చెప్పుకొని తిరగడానికి కారణం.. నిజమైన ఉద్యమకారులు ఎవ్వరూ కూడా మేము ఉద్యమకారులం అని చెప్పుకోకవడం అని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నిజమైన ఉద్యమకారులంతా గర్వంగా చెప్పుకోవాలని.. మీ వల్లే తెలంగాణ వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో తాను ఎవరినీ శత్రువులుగా చూడను.. అలా చూడాలన్నా వాళ్ళకి ఆ స్థాయి ఉండాలని అన్నారు.






