Revanth Reddy: జ్యూరిచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సందడి..

by Ramesh Naini |

దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోమవారం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.

Revanth Reddy: జ్యూరిచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సందడి..
X

దిశ, డైనమిక్ బ్యూరో: దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం (The World Economic Forum) సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోమవారం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. సీఎం రేవంత్ (CM Revanth Reddy) టీమ్ జ్యూరిచ్ (Zurich) విమానాశ్రయం చేరుకోగానే అక్కడ స్థిరపడిన తెలుగు వారితో సందడి నెలకొంది. ముఖ్యమంత్రికి పెద్ద ఎత్తున హాజరై అభినందనలు తెలియజేశారు. ఇక, దావోస్ (Davos) సదస్సు తొలి రోజున పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమవుతారు. అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే నిర్దిష్టమైన భవిష్యత్తు ప్రణాళికతో ఈ పర్యటనపై రాష్ట్ర ప్రతినిధి బృందం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

అదేవిధంగా జ్యూరిచ్ విమానాశ్రయంలో రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు పరస్పరం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి శ్రీధర్ బాబు, ఏపీ మంత్రి నారా లోకేష్ ఉన్నారు.

Next Story