- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tank Bund Shiva : ట్యాంక్ బండ్ శివకు సీఎం రేవంత్ రెడ్డి ఆపన్నహస్తం
హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్) నీళ్లలో దూకి ఆత్మహత్యకు పాల్పడే ఎంతో మందిని అడ్డుకుని, వారి ప్రాణాలను కాపాడిన ‘ట్యాంక్ బండ్ శివ’కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది.

దిశ, డైనమిక్ బ్యూరో: హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్) నీళ్లలో దూకి ఆత్మహత్యకు పాల్పడే ఎంతో మందిని అడ్డుకుని, వారి ప్రాణాలను కాపాడిన ‘ట్యాంక్ బండ్ శివ’కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. శివ గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయంతో పాటు, కుమారుడికి ఉద్యోగాన్ని అందజేశారు.ఎందరో ప్రాణాలను కాపాడిన ట్యాంక్ బండ్ శివ.. సరైన ఉపాధి లేక, కుటుంబ పోషణ భారమై తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి చేరింది. దీనిపై వెంటనే స్పందించిన సీఎం.. శివ కుటుంబానికి అవసరమైన సాయం అందించాలని కొద్ది రోజుల క్రితమే అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో, మంగళవారం శివ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అందజేశారు. అలాగే శివ కుమారుడు వేణుమాధవ్‌కు హోం గార్డు ఉద్యోగాన్ని కల్పిస్తూ, అందుకు సంబంధించిన నియామక పత్రాన్ని కూడా ముఖ్యమంత్రి తన చేతుల మీదుగా అందజేశారు.
సొంతింటి కల సాకారం.. ఉపాధికి మార్గం
శివ కుటుంబానికి శాశ్వత గూడు కల్పించేలా డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తన కుటుంబానికి శాశ్వత ఉపాధి కల్పించేందుకు గాను.. ట్యాంక్ బండ్ సమీపంలో ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలని శివ ముఖ్యమంత్రిని కోరారు. శివ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీఎం.. ఆ దిశగా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆపదలో ఉన్న ఎందరినో కాపాడిన తమను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవడం పట్ల శివ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. నేరుగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా సాయం అందుకోవడం పట్ల ట్యాంక్ బండ్ శివ, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.






