- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక వెండింగ్ జోన్స్: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో వీధుల ఆధునీకరణ, సుందరీకరణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ రీజియన్ (Telangana Rising Core Urban Region) పరిధిలో వీధుల ఆధునీకరణ, సుందరీకరణ చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఈ పరిధిలోని పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, విద్యుత్ సబ్ స్టేషన్ల అప్‌గ్రేడేషన్‌తో పాటు, విచ్చలవిడిగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను స్ట్రీమ్ లైన్ చేసి రీ-లొకేట్ చేయాలని సూచించారు. ఇవాళ తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధి ప్రతిపాదనలపై సచివాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదు ప్రధాన అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. అనుమతుల విషయంలో వివిధ విభాగాల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలని, మంచినీటి, మురుగునీటి వ్యవస్థపై నిర్వహణ వేర్వేరుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శేషాద్రి, శ్రీనివాసరాజు, స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి, సీఎం సెక్రటరీలు, జీహెచ్ఎంసీ, హైడ్రా, హెచ్ఎండీఏ కమిషనర్లు, డీజీపీ జితేందర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.






