- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఎస్‌ను టీజీగా మార్చడానికి రీజన్ ఇదే.. CM రేవంత్ క్లారిటీ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అధికారంలోకి వచ్చాక.. టీఎస్‌ను టీజీగా మార్చుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అధికారంలోకి వచ్చాక.. టీఎస్‌ను టీజీగా మార్చుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఈ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జలవిహార్‌లో దేవేందర్ గౌడ్ రాసిన విజయ తెలంగాణ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎంతో సమానమైన అధికారాన్ని వదులుకుని తెలంగాణ కోసం దేవేందర్ గౌడ్(Devender Goud) ముందుకొచ్చారని గుర్తుచేశారు. టీజీని మొదటగా దేవేందర్‌గౌడ్ నిర్ణయించారు.. అందుకే తాము అధికారంలోకి వచ్చాక టీజీనే ఉండాలని అమలుచేశామని చెప్పారు. ఉద్యమ సమయంలో బైకులపై యువత టీజీ(TG - Telangana) అనే రాసుకునే వారని అన్నారు.
తెలంగాణ చరిత్ర కోసం లండన్ తరహా మ్యూజియం(London Style Museum) రావాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ చరిత్ర(History of Telangana) ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది.. తెలంగాణ చరిత్ర, స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది.. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ.. తెలంగాణ చరిత్ర కాదని అన్నారు. ఉద్యమకారులను పదేళ్లు పట్టించుకోలేదు.. ఉద్యమ కారుల త్యాగంగొప్పది..వాళ్ల చరిత్ర నిలిచిపోవాలని అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల కోసం దేవేందర్ పోరాటం చేశారని కొనియాడారు.






