మీరు చేయాల్సింది అదే.. ఐఏఎస్‌లకు CM రేవంత్ దిశానిర్దేశం

by Gantepaka Srikanth |

తెలంగాణ కేడర్‌కు చెందిన 2024 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్‌లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

మీరు చేయాల్సింది అదే.. ఐఏఎస్‌లకు CM రేవంత్ దిశానిర్దేశం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కేడర్‌కు చెందిన 2024 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్‌లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన ముఖ్యమంత్రి, బాధ్యతల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రిని కలిసిన సౌరభ్ శర్మ (Saurabh Sharma), సలోని ఛబ్రా (Saloni Chhabra), హర్ష చౌధరి (Harsha Choudhary), కరోలిన్ చింగ్తియన్మావి (Carolyn Chingthianmawi), కొయ్యడ ప్రణయ్ కుమార్ (Koyyada Pranay Kumar)లు ప్రస్తుతం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, CS కె.రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



Next Story