- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్‌కు పేరొస్తుందనే కేసీఆర్ ఆ పని చేయలేదు.. రేవంత్ రెడ్డి ఫైర్
జగన్ పోతిరెడ్డిపాటు విస్తరిస్తుంటే కేసీఆర్ చూస్తూ ఉండిపోయారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే దురుద్దేశంతోనే కేసీఆర్ పదేళ్లు ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా మన్నెవారిపల్లిలో పర్యటించిన సీఎం.. అక్కడ ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రాజెక్టు 1983 లో మంజూరైందని దీనిని పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వవం ఎంతో కృషి చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి 30 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తయిందని కానీ కేసీఆర్ (KCR) ప్రభుత్వం పదేళ్లలో మిగతా 10 కి.మీ టన్నెల్ పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. ఈ ప్రాజెక్టులో కమిషన్ కూడా రాదని కేసీఆర్, హరీశ్ రావు రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రాజెక్టును పక్కకు పెట్టారన్నారు.
నాడు కేసీఆర్ చూస్తూ ఊరుకున్నారు:
ఏపీలో జగన్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడును విస్తరిస్తుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకున్నారని ధ్వజమెత్తారు. రూ. 2 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే నల్గొండ జిల్లాకు నీరు అందేది కదా అని అని ప్రశ్నించారు. గ్రావిటీ ద్వారా నల్గొండకు నీళ్లు తీసుకెళ్లాలనుకుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. గత పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు కేసీఆర్ ప్రభుత్వం రూ. 1.86 లక్షల కోట్లు చెల్లించింది. ఇందులో రూ. 1.06 లక్షల కోట్లు కేవలం కాళేశ్వరం కాంట్రాక్టర్లకే చెల్లించిందని విమర్శించారు. కృష్ణా నది మీద చేపట్టిన అన్ని ప్రాజక్టులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. ప్రపంచంలో 40 కి.మీ టన్నెల్ ఎక్కడా లేదని ఇది పూర్తయితే తెలంగాణకు ఆ రికార్డు దక్కుతుందన్నారు. ఆనాడు 2 వేల కోట్లు ఖర్చుతో ఈ ప్రాజెక్టు పూర్తయ్యేదనని ఇప్పుడు పెరిగిన అంచనాలతో 4600 కోట్లతో ఈ టన్నెల్‌ను పూర్తి చేయొచ్చన్నారు. కేసీఆర్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును మాత్రమే కాదు కృష్ణా నదిపై ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. కృష్ణాలో మన వాటా మనం తీసుకోకపోవడం వల్ల ఆ నీటిని ఆంధ్రా తరలించుకు పోతోందని 299 టీఎంసీలు చాలు అని ఆనాడు హరీష్ సంతకం పెట్టి వచ్చారన్నారు. మన వాటా మనకు దక్కాల్సిందేనని ట్రిబ్యునల్‌లో దీనిపై మేం వాదనలు వినిపిస్తూ ఒక కొలిక్కి తీసుకొస్తున్నామన్నారు. ఇంత తక్కువ ఖర్చుతో 30 టీఎంసీలు తీసుకు వెళ్లే ప్రాజెక్టు ఎక్కడా లేదని చెప్పారు.
హరీష్ రావు చిల్లర మాటలు మానుకోవాలి:
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో దురదృష్టవశాత్తు 8 మంది కార్మికులు చనిపోయారని ఈ విషయంలో మాకు బాధ ఉన్నా ఆ కుటుంబాలను ఆదుకుని పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆర్మీలో ఉన్న పరిచయాలతో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. హరీష్ రావు చిల్లర మాటలు మానుకోవాలన్నారు. తప్పులు, అప్పులు చేసి దోపిడీ చేశారనే ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ఇక్కడి ప్రజలు మమ్మల్ని క్షమించరని ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేస్తామన్నారు. ముంపునకు గురవుతున్న మర్లపాడు, కేశ్య తండా, నక్కలగండి తండా ప్రజలను ఆదుకుని, డిసెంబర్ 31 లోగా సమస్యలు పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వానిదని చెప్పారు. ఇప్పుడు కాకపోతే ఈ ప్రాజెక్టును ఇంకెప్పుడూ పూర్తి చేసుకోలేమని ఎన్ని అడ్డంకులు వచ్చినా తొలగొంచుకుని ప్రాజెక్టు పూర్తి చేసుకుందామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకోకపోతే నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలకు నష్టం కలుగుతుందని చెప్పారు.
READ MORE ....
SLBC Tunnel: ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల నేతృత్వంలో సర్వే ప్రారంభం






