- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మారుతారని ఆశించా.. కానీ ఎలాంటి మార్పులు రాలేదు.. మళ్లీ అవే అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టిన ప్రాంతం గురించి పచ్చి అసత్యాలు చెప్పారని సీరియస్ అయ్యారు. తెలంగాణకు కేసీఆర్ చేసిన మేలు కంటే.. అన్యాయమే ఎక్కువ చేశారని అన్నారు. ఆరోపణలు చేయడం కాదు.. దమ్ముంటే చర్చకు రావాలి.. వచ్చే జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు పెడతాం.. దమ్ముంటే కేసీఆర్ సమావేశాలకు రావాలని సవాల్ చేశారు. తెలంగాణకు ఎవరేం చేశారో సభలోనే చర్చిద్దామని అన్నారు. కలుగులోంచి ఎలుక బయటకు వచ్చినట్లు ఇవాళ కేసీఆర్ బయటకు వచ్చారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వాత పెట్టడంతో కనువిప్పు కలిగిందని అన్నారు. కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది అని కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. నాలుగు రకాలుగా అవకాశాలు ఉంటే.. అన్ని రకాల అప్పులు చేశారని అన్నారు.






