- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు వివాదం.. స్పందించిన రాజాసింగ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. మంగళవారం టీపీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అధ్యక్షతన గాంధీ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (PCC) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం లేదనే విషయం మీద వ్యాఖ్యానిస్తూ.. దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం లేనపుడు ఇక పార్టీలో ఉన్న ఇంతమందికి ఎలా ఉంటుందని అన్నారు. హిందుల్లో 3 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారని, పెళ్లికాని వారు హనుమంతుడిని, పెళ్లి చేసుకున్న వారు మరో దేవుడిని, కొంతమంది శివమాల, ఇంకొంతమంది అయ్యప్పమాల వేస్తారని అన్నారు. మందుతాగేవాళ్లకు, పప్పన్నం తినేవాళ్లకు, మాంసం తినేవాళ్లకు అంటూ దేవుళ్ళ మీద ఏకాభిప్రాయం లేనప్పుడు.. తమ పార్టీలోనూ అన్ని రకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉన్నారని, వీరందరికీ ఏకాభిప్రాయమే ఉండాలంటే ఎలా కుదురుతుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదంగా మారాయి.
ఈ నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్స్ (ట్విట్టర్) లో స్పందిస్తూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం హిందూ దేవుళ్లను అవమానపరచడమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకు ప్రతి సారి సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవతలను టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ అని, ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ అన్నట్లు గుర్తుకు చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలపై ఎవరు చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలీసులు, సిస్టమ్ అంతా ఆయన చేతిలో ఉందని, ఆయనపై చర్యలు ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. ఓవైసీ బ్రదర్స్ తో చేతులు కలిపిన తర్వాత హిందూ దేవుళ్లను అవమానించాలి, ఇస్లాం మతం స్వీకరించాలని కోరిన కలిగిందా? అని సీఎంను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి దేవుళ్లును అవమానిస్తున్నారని తెలంగాణ ప్రజలు ఇది గమనించాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు. ట్వీట్ ఇదే..






