దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. నెట్టింట్లో వైరల్

by Muthe.Rajitha |

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. నెట్టింట్లో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మంగళవారం టీపీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అధ్యక్షతన గాంధీ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (PCC) సమావేశం జరిగింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్, మంత్రులు, కొత్తగా ఎన్నికైన పార్టీ జిల్లా అధ్యక్షులు, పూర్వ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం లేదనే విషయం మీద వ్యాఖ్యానిస్తూ.. దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం లేనపుడు ఇక పార్టీలో ఉన్న ఇంతమందికి ఎలా ఉంటుందని అన్నారు.

హిందుల్లో 3 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారని.. పెళ్లికాని వారు హనుమంతుడిని, పెళ్లి చేసుకున్న వారు మరో దేవుడిని, కొంతమంది శివమాల, ఇంకొంతమంది అయ్యప్పమాల వేస్తారని అన్నారు. మందుతాగేవాళ్లకు, పప్పన్నం తినేవాళ్లకు, మాంసం తినేవాళ్లకు అంటూ దేవుళ్ళ మీద ఏకాభిప్రాయం లేనపుడు.. తమ పార్టీలోనూ అన్ని రకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉన్నారని, వీరందరికీ ఏకాభిప్రాయమే ఉండాలంటే ఎలా కుదురుతుందని పేర్కొన్నారు. కాగా సీఎం దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. రేవంత్ హిందువులను అవమానించాడని కొంతమంది వ్యాఖ్యానిస్తుండగా.. మరికొంత మంది మాత్రం రేవంత్ నిజమే మాట్లాడారని అంటున్నారు. ప్రస్తుతం రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Next Story