హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: టూరిజం కాంక్లేవ్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో తెలంగాణ టూరిజం కాంక్లేవ్ - 2025 కార్యక్రమం నిర్వహించారు.

హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: టూరిజం కాంక్లేవ్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో (Telangana Tourism Conclave) తెలంగాణ టూరిజం కాంక్లేవ్ - 2025 కార్యక్రమం నిర్వహించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయినా టూరిజానికి ఒక పాలసీ లేదని అన్నారు. మా ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టూరిజంకు ప్రత్యేక పాలసీ తీసుకువచ్చామని చెప్పారు. పర్యాటక రంగంలో రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చిన మంత్రి జూపల్లిని అభినందిస్తున్నట్లు వెల్లడించారు. కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే కాదు.. రూ. 50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చే సత్తా తెలంగాణకు ఉందని తేల్చి చెప్పారు.

హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అని సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని, ప్రపంచ నగరాలతో నగరం పోటీ పడుతుందని తెలిపారు. భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించామని గుర్తుకు చేశారు. తెలంగాణలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని వెల్లడించారు. శాంతి భద్రతల విషయంలో తెలంగాణ సేఫెస్ట్ ప్లేస్ అని, తెలంగాణలో మీ పెట్టుబడులకు రక్షణ ఉంటుందని చెప్పుకొచ్చారు.

Next Story