CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు

by Y. Venkata Narasimha Reddy |

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన సంక్షేమ అభివృద్ధి పథకాలతో లబ్ధిపొందనున్న వర్గాల ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి జోరుగా పాలాభిషేకా( Milk Anointing)లు చేసి తమ హర్షాతీరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు
X

దిశ, వెడ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన సంక్షేమ అభివృద్ధి పథకాలతో లబ్ధిపొందనున్న వర్గాల ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి జోరుగా పాలాభిషేకా( Milk Anointing)లు చేసి తమ హర్షాతీరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 26 గణతంత్ర దినోత్సం నుంచి రైతు భరోసా ఎకరాకు రూ.12వేలు, భూమిలేని కూలీల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో ఏడాదికి రూ.12వేలు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పథకాలు అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ పథకాలతో లక్షల మంది లబ్ధి పొందనుండటంతో ఆ వర్గాల్లో ఆనందోత్సహాలు వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు( Abhishekalu) చేస్తున్నారు.

చేనేత కార్మికుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 168కోట్లతో చేనేత అభయ హస్తం పథకం అమలుకు నిర్ణయం తీసుకోవడం పట్ల చేనేత కుటుంబాలు సంబరాలు తెలుపుతు రేవంత్ రెడ్డి ప్లెక్సీలకు పాలభిషేకాలు చేస్తున్నాయి. హన్మకొండ జిల్లా కమలాపూర్ చేనేత కార్మికులతో పాటు అన్ని జిల్లాల్లో చేనేత సంఘాల ఆధ్వర్యంలో రేవంత్ చిత్ర పటాలకు పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. చేనేత అభయ హస్తం పథకంలో భాగంగా నేతన్న పొదుపు నిధికి రూ.115కోట్లు, నేతన్న భద్రతకు రూ.9కోట్లు, నేతన్న భరోసాకు రూ.44కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

నేతన్న పొదుపు పథకంల సొసైటీల్లోని చేనేత కార్మికులు తమ వేతనం నుంచి ప్రతి నెల 8శాతం పొదుపు చేస్తే ప్రభుత్వం రెట్టింపుగా 16శాతం వాటా జమచేస్తుంది. ఈ పథకంతో 38వేల మంది కార్మికులు ప్రయోజనం పొందుతారు. మరమగ్గాల కార్మికులు 8శాతం జమచేస్తే ప్రభుత్వం 8శాతం జమచేస్తుంది. దీని ద్వారా 15వేల మరమగ్గాల కార్మికులు లబ్ధి పొందుతారు. నేతన్న భద్రత కింద ఏ కారణంతోనైన మరణించే కార్మికులకు రూ.5లక్షల బీమా అందిస్తారు. నేతన్న భరోసా కింద కార్మికులు ఉత్పత్తి చేసే వస్త్రాల పరిమాణానికి అనుగుణంగా ఒక్కో చేనేత కార్మికుడికి ఒక సంవత్సరం రూ.18వేలు, అనుబంధ కార్మికునికి రూ.6వేలు మంజూరు చేస్తారు.

Next Story