CM Revanth Reddy : ఒక్కటి తగ్గినా క్షమాపణ చెబుతా : సీఎం రేవంత్ రెడ్డి సవాల్

by Muthe.Rajitha |

తాను చెప్పిన లెక్కల్లో ఒక్కటి తక్కువైందని ఎవ్వరు నిరూపించినా క్షమాపణ చెబుతానని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సవాల్ చేశారు.

CM Revanth Reddy : ఒక్కటి తగ్గినా క్షమాపణ చెబుతా : సీఎం రేవంత్ రెడ్డి సవాల్
X

దిశ, వెబ్ డెస్క్ : తాను చెప్పిన లెక్కల్లో ఒక్కటి తక్కువైందని ఎవ్వరు నిరూపించినా క్షమాపణ చెబుతానని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సవాల్ చేశారు. నేడు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరి సభ(Congress Samarabheri Sabha)లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా.. తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించామని పేర్కొన్నారు. మోడీ, కేసీఆర్, కేటీఆర్ దీనిపై చర్చ పెట్టాలని, ఒక్క ఉద్యోగం తక్కువ ఇచ్చినట్టు నిరూపించినా వారి కాళ్ళ ముందు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని ఛాలెంజ్ విసిరారు.

బీఆర్ఎస్ పాలనలో యువతను గొర్రెలు, బర్రెలు కాయాలని, చెప్పులు కుట్టుకోవాలని, చేపలు పట్టుకోవాలని వారి కులవృత్తుల్లోకి మళ్ళీ వాళ్ళని నెట్టాలని చూశారని అన్నారు. తాము మాత్రం తెలంగాణ బిడ్డలు ప్రభుత్వ ఆఫీసర్లయి, మంచి ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి, వాటిని సకాలంలో పూర్తి చేస్తున్నామని తెలియజేశారు.

Next Story