- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Singapore River: సింగపూర్ నదిలో సీఎం రేవంత్ రెడ్డి పడవ ప్రయాణం.. పునరుద్ధరణ తీరు పరిశీలన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సారథ్యంలో (Telangana Rising) తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ (Singapore) పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. తెలంగాణలో పెట్టుబడుల నేపథ్యంలో సీఎం రేవంత్ టీమ్ అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశాలు, కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన (Singapore River) సింగపూర్ నదిలో పడవ ప్రయాణం చేసి, అక్కడి నది పునరుద్ధరణ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా పలు విషయాలను పంచుకున్నారు.
సింగపూర్ నదిలో పడవ ప్రయాణం చేసి, నదుల పునరుజ్జీవనం సిటీ-స్టేట్ అనుసరించిన ఉత్తమ పద్ధతులు తెలుసుకున్నట్లు తెలిపారు. నీటి నిర్వహణలో పురోగతి, వారసత్వ భవనాల పునరుద్ధరణ, అద్భుతమైన కొత్త ఐకానిక్ భవనాలు, కార్యాలయాలు, నివాసాలు, పట్టణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం గమనించినట్లు పేర్కొన్నారు. ఇలా వరల్డ్ క్లాస్ హైదరాబాద్‌ను క్రియేట్ చేయడానికి మనం ఇంకా ఉత్తమ పద్ధతులను స్వీకరించడం నేర్చుకోవాలి, మనం చేస్తాము.. అని ధీమా వ్యక్తం చేశారు.






