- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KCR Birthday: సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్
బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విషెస్ చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విషెస్ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినం సందర్భంగా వారికి హార్దిక శుభాకాంక్షలు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలి’ అని ఆకాంక్షించారు.
మరోవైపు.. కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు ‘వృక్షార్చన’కు శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి సెల్ఫీ దిగి 9177916838 నంబర్‌కు వాట్సాప్ చేయాలని సంస్థ కోరింది. ఇందులో భాగంగా గ్రామ, మండల, నియోజకవర్గాలు, పట్టణాల్లో వృక్షార్చనపై క్షేత్ర స్థాయిలో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ అవగాహన కల్పించారు. పోస్టర్లు ఆవిష్కరించి వృక్షార్చనపై విస్తృత ప్రచారం కల్పించారు.
గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు… pic.twitter.com/OTtysLYlya
— Telangana CMO (@TelanganaCMO) February 17, 2025






