- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: మంత్రులతో సీఎం రేవంత్ జూమ్ మీటింగ్
సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. రేపు మేయర్లు, చైర్ పర్సన్ల ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మంత్రులు, టీపీసీసీ చీఫ్ కు దిశానిర్దేశం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో జూమ్ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవలే మున్సిపల్ ఎన్నికలు పూర్తవ్వగా.. మేయర్లు, చైర్మన్ల ఎన్నికలపై సీఎం దిశానిర్దేశం చేశారు. రేపే చైర్ పర్సన్లు, మేయర్ల ఎన్నిక ఉండనుండటంతో.. వారిని ఎలా ఎన్నుకోవాలన్నదానిపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరగ్గా.. 13న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో 85 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరో 10 స్థానాలను కూడా చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఒక్కో మున్సిపాలిటీ, కార్పొరేషన్లో వార్డు సభ్యులతో పాటు మీటింగ్ కు వచ్చే ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కలిపి 50 శాతానికి పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, డిప్యూటీ చైర్ పర్సన్ గా ఎన్నుకుంటారు.






