CM Delhi Tour: రాహుల్ గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |

లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ గారిని సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశాను.

CM Delhi Tour: రాహుల్ గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. ఇవాళ తోలుత పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన ముఖ్యమంత్రి అనంతరం ఏఐసీసీ పెద్దలను కలిశారు. ఏఐసీసీ అగ్రనేత, లోక్‍సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని (Rahul Gandhi) మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకు ముందు కాగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఎంపీ కేసీ వేణుగోపాల్‍ను (KC Venugopal) కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి చర్చించారు. కాగా ఇవాళ ఉదయం కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అయిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పలు కీలక ప్రాజెక్టులపై వారితో చర్చించారు.

Next Story